అమ్మ..నాన్న...సమంత!
on Nov 3, 2018
'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' - పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన సినిమా టైటిల్ ఇది!
'అమ్మ.. నాన్న.. సమంత' - అక్కినేని నాగచైతన్య ఫోనులో స్పీడ్ డయల్ లిస్ట్ ఇది!
ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ వుండటం ఈ రోజుల్లో సహజం! అందులోనూ స్మార్ట్ ఫోనులో రోజుకు ఒక అప్డేట్ వస్తుంటుంది. ఫోన్ యూజర్స్ చేతికి శ్రమ తగ్గిస్తుంది. శ్రమ తగ్గించే ఆప్షన్స్‌లో స్పీడ్ డయల్ లిస్ట్ ఒకటి. జస్ట్ కీప్యాడ్ మీద ఒక నంబర్‌ను గట్టిగా నొక్కితే చాలు... ఆల్రెడీ ఆ నంబర్‌పై సేవ్ చేసిన కాంటాక్ట్‌కి డయల్ అవుతుంది. ఈ విధంగా చైతూ ఫోనులో స్పీడ్ డయల్ లిస్టులో ఎవరెవరి పేర్లు వున్నాయో తెలుసా? చైతూ తల్లి లక్ష్మి, తండ్రి నాగార్జున, శ్రీమతి సమంత నంబర్లు! తాజా ఇంటర్వ్యూలో నాగచైతన్యను మీ ఫోన్ స్పీడ్ డయల్ లిస్టులో ఎవరెవరి నంబర్లు వున్నాయని ప్రశ్నించగా... 'అమ్మ.. నాన్న... సమంత'తో పాటు ఇద్దరు ముగ్గురు సన్నిహిత మిత్రుల నంబర్లు సేవ్ చేసుకున్నానని తెలిపారు.