వెంకీమామ... జోతిష్యశాస్త్రమా!
on Oct 30, 2018
మేనమామ వెంకటేష్‌తో కలిసి అక్కినేని నాగచైతన్య చేస్తున్న సినిమా 'వెంకీమామ'. సినిమాలోనూ వీరిద్దరూ మామ, అల్లుడు పాత్రల్లో కనిపించనున్నారు. 'పవర్', 'సర్దార్ గబ్బర్ సింగ్', 'జై లవకుశ' సినిమాల తరవాత కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. నవంబర్ 12వ తేదీన రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే... ఈ చిత్రాన్ని జోతిష్య శాస్త్ర నేపథ్యంలో తీస్తున్నార్ట! మనుషుల జీవితాలపై జోతిష్య శాస్త్రం ఎటువంటి ప్రభావం చూపుతుంది? జోతిష్యాన్ని నమ్మడం వలన మామ అల్లుడు మధ్య ఎటువంటి మనస్పర్థలు, విబేధాలు వచ్చాయి? అనేది మూలకథ అట! వెంకటేష్ సరసన బాలీవుడ్ బొద్దుగుమ్మ హ్యూమా ఖురేషి, నాగచైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మిస్తున్నాయి. 2019 వేసవిలో సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.