అరవింద.. అమెరికాలో లాసే!
on Oct 30, 2018
అమెరికాలో 'అరవింద సమేత వీరరాఘవ' సినిమా 2 మిలియన్ డాలర్స్ మార్క్ క్రాస్ చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు అమెరికా ప్రేక్షకుల నుంచి చక్కటి ఆదరణ లభించింది. అమెరికా ప్లస్ నాన్ అమెరికా మార్కెట్స్ కలుపుకుంటే... మొత్తం మీద $2170395 (భారతీయ కరెన్సీలో సుమారు 16 కోట్లు) గ్రాస్ వసూలు చేసింది.
వసూళ్ల పరంగా చూసుకుంటే 'అరవింద సమేత వీరరాఘవ' సినిమా అమెరికాలో బ్లాక్ బస్టర్ హిట్. మొన్నటివరకూ 'నాన్నకు ప్రేమతో' సినిమా ఎన్టీఆర్ కెరీర్లో హైయెస్ట్ ఓవర్సీస్ వసూళ్లు సాధించిన సినిమాగా వుండేది. దాన్ని పక్కకు తోసి 'అరవింద...' ఆ ప్లేసులోకి అచ్చింది. ఓవర్సీస్లో ఆల్ టైమ్ కలెక్షన్స్ సాధించిన సినిమాల లిస్టులోకి సినిమా చేరింది. టాప్ 10లోకి వచ్చింది. అయితే... డిస్ట్రిబ్యూటర్‌కి మాత్రం సినిమా కొంత నష్టాన్ని మిగిల్చింది. ఓవర్సీస్లో 'అరవింద'కు వచ్చిన రూ.16 కోట్లలో డిస్ట్రిబ్యూటర్ చేతికి వచ్చిన షేర్ రూ.10.90 కోట్లు మాత్రమే. సినిమాను రూ.11.70 కోట్లకు కొన్నారు. రూ.80లక్షలు లాస్ వచ్చింది అన్నమాట!