కాన్సెప్ట్ రొటీన్ -టీజర్ గ్రాండ్
on Oct 30, 2018
మనం ఆపదలో ఉన్నప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉండే బలగం కాదు...మనలో ఉన్న బలం అంటున్నారు హీరో రవితేజ, దర్శకుడు శ్రీనువైట్ల. అమర్ అక్బర్ ఆంటోని టీజర్లోని రవితేజ చెప్పిన డైలాగ్ ఇది .కానీ సినిమా హిట్టవ్వాలంటే నటీనటుల బలగమే కాదు... కథా బలమూ కావాలి కదా మరి. టీజర్ గ్రాండ్ గా ఉన్నా రొటీన్ రివేంజ్ ఫార్ములా లాగానే కనిపిస్తోంది. `అమర్ అక్బర్ ఆంటోని` చిత్రం టీజర్ ఈ రోజు సాయంత్రం 4గంటలకు విడుదలైంది. . ఇంతకు ముందు ఒక టీజర్ విడుదలైంది. ఇప్పుడు రెండో టీజర్ వచ్చేసింది. ఇది చూశాక రవితేజ, శ్రీనువైట్ల చాలా కసితో ఈ సినిమా చేసారని తెలుస్తోంది. టీజర్ చాలా స్టైలిష్ గా విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. `అమర్ అక్బర్ ఆంటోని` త్రి క్యారక్టర్స్ గురించి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇందులో మూడు పాత్రలు చేయడం లేదన్నదీ దర్శకుడు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆ సస్పెన్స్ ఏంటో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. మైత్రి వారు రవితేజ్ మార్కెట్ ని బట్టి కాకుండా స్టోరీ మేరకు భారీగానే ఖర్చు చేసారు. చాలా గ్యాప్ తర్వాత ఇలియానా తెలుగులో నటి్స్తోంది. ఇలియానా కొంచెం బొద్దుగా కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగా భారీగానే పారితోషికం తీసుకుంది మరి. ఈ సినిమాను నవంబర్ 16న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.