ప్రభాస్... పెళ్లి ఎప్పుడు?
on Oct 25, 2018
'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?'... ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ప్రేక్షకులకు 658 రోజులు పట్టింది. అంటే... 22 నెలలు. సుమారు రెండేళ్లు అనుకోండి. 'బాహుబలి' రెండు భాగాలుగా విడుదలైంది. ప్రేక్షకులు సినిమాను చూడటం జరిగింది. ప్రభాస్ అభిమానులు సంతోష పడటమూ జరిగింది. కానీ, అభిమానుల్లో ఒక వెలితి మాత్రం అలాగే వుంది. ఓ ప్రశ్నకు సమాధానం ఎప్పుడు దొరుకుతుందా? అని ఎదురు చూస్తున్నారు. ఆ ప్రశ్నే 'ప్రభాస్ పెళ్లి ఎప్పుడు?'. 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?' ప్రశ్న కంటే ముందునుండి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని ఎదురు చూస్తున్నారు. ఎప్పటికప్పుడు పెళ్లి ప్రశ్నను ప్రభాస్ దాటవేస్తున్నాడు.
'బాహుబలి' విడుదల తరవాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని కృష్ణంరాజు ఒకానొక సందర్భంలో చెప్పారు. 'బాహుబలి' విడుదలైంది. తరవాత 'సాహో' మొదలైంది. కానీ, ప్రభాస్ పెళ్లి ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ ఏడాది ప్రభాస్ పెళ్లి లేనట్టే. ప్రస్తుతం 'సాహో' పూర్తైన తరవాత పెళ్లి చేసుకోవాలని ప్రభాస్ ఆలోచిస్తున్నారట. దీన్నిబట్టి 2019లో పెళ్లి చేసుకునే అవకాశాలు వున్నాయని అనుకోవాలి. కుమారుడికి పెళ్లి అయితే చూడాలని ప్రభాస్ తల్లి కోరిక. కుమారుణ్ణి త్వరగా పెళ్లి చేసుకోమని ఆమె విపరీతంగా ఒత్తిడి చేస్తున్నారట.!