ఆ హీరోతో రకుల్ మరోసారి రొమాన్స్!!
on Oct 24, 2018
టాలీవుడ్ లో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకున్న నటి రకుల్ ప్రీతి సింగ్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన రకుల్ ఆ సినిమా నటిగా మంచి గుర్తింపుతేవడంతో స్టార్ హీరోలందరి సరసన నటించే చాన్స్ కొట్టేసింది. `స్పైడర్` చిత్రం రకుల్ పెద్దగా సినిమాలు చేయలేదు అనడం కంటే అవకాశాలు రాలేదని కూడా చెప్పవచ్చు. మళ్లీ కొంత గ్యాప్ తర్వాత `ఎన్టీఆర్` చిత్రంలో శ్రీదేవి పాత్రలో నటిస్తోంది రకుల్. ఈ సినిమా తర్వాత మళ్లీ వరుసగా సినిమాలు కమిట్ అవుతూ బిజీ అవుతోంది. నెక్ట్స్ మంత్ నుంచి ఓ మల్టీస్టారర్ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతుంది. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే...మామా వెంకటేష్, మేనల్లుడు నాగచైతన్య కాంబినేషన్ లో బాబి డైరక్షన్ లో `వెంకీ మామా` (వర్కింగ్ టైటిల్) పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో చైతు సరసన హీరోయిన్ గా నటిస్తోందట రకుల్. ఇప్పటికే వీరిద్దరు కలిసి `రారండోయ్ వేడుక చేద్దాం` చిత్రంలో నటించారు. మరో సారి వీరిద్దరూ వెంకీ మామలో రొమాన్స్ చేయబోతున్నారు. ఇది కాక మరో రెండు చిత్రాల్లో కూడా రకుల్ నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.