ENGLISH | TELUGU  

త్రివిక్రమ్ గారూ... ప్రయోగాలు వద్దు!

on Oct 24, 2018

'అరవింద సమేత వీరఘవ' సినిమా విడుదల ముందు వరకూ త్రివిక్రమ్ అంటే ఓ 'అతడు', ఓ 'జల్సా', ఓ 'అత్తారింటికి దారేది', ఓ 'జులాయి', ఓ 'సన్నాఫ్ సత్యమూర్తి' గుర్తుకు వచ్చేవి. ఇప్పుడు 'అరవింద సమేత..' కూడా గుర్తుకు వస్తుంది. 'అత్తారింటికి దారేది'లో మేనల్లుడు-అత్త మధ్య భావోద్వేగాలను చూపించినా... 'సన్నాఫ్ సత్యమూర్తి'లో తండ్రిపై ఓ కొడుకుకు ఎంత ప్రేమ వుందో చూపించినా... అవన్నీ కమర్షియల్ విజయాలు సాధించాయి. 'జల్సా', 'జులాయి' కమర్షియల్ సినిమాలే! త్రివిక్రమ్ వంటి మేథావి కమర్షియల్ సినిమాలకు పరిమితం కావడం ఆయన అభిమానులకు నచ్చలేదు. అటువంటి అభిమానులకు 'అరవింద సమేత...'తో ఆన్సర్ దొరికింది. మొదటి 20 నిమిషాల తరవాత ఫైట్ లేకుండా, ఆయన నుంచి ప్రేక్షకులు ఆశించే వినోదం లేకుండా సినిమా తీసి ప్రయోగం చేశారు. ఈ ప్రయోగానికి మిశ్రమ స్పందన లభించింది. కొంతమంది సినిమా బావుందని అంటుంటే.. కొందరు బాలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ తదుపరి సినిమా ఎలా వుండబోతుందనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అల్లు అర్జున్ హీరోగా ఆయన ఓ సినిమా చేయడం దాదాపు ఖాయమే.

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఇంతకు ముందు 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలు వచ్చాయి. తాజాగా తెరకెక్కబోయేది ముచ్చటగా మూడో సినిమా అన్నమాట! ముందు వచ్చిన రెండు సినిమాలు కమర్షియల్ సినిమాలే. తాజాగా రాబోయేది కూడా కమర్షియల్ సినిమాయే. త్రివిక్రమ్‌తో ప్రయోగాలు వద్దని అల్లు అర్జున్ చెప్పాడట. 'అరవింద...' టైపులో కాకుండా కమర్షియల్ సినిమా చేద్దామని ఆయన్ను అడిగాడని ఫిలింనగర్ టాక్. త్రివిక్రమ్ స్టైల్ పంచ్ డైలాగులు, కమర్షియల్ అంశాలతో సినిమా చేయాలని అల్లు అర్జున్ మనసులో వుందని తెలుస్తుంది.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.