చిరంజీవిలా మారిన ప్రభాస్
on Oct 24, 2018
ఇక్కడ బైక్ మీద వెళ్తున్న హీరో ఎవరు? రెండోసారి ఫొటో చూడకుండా ఒక్క క్షణంలో ఠక్కున చెప్పండి! కొంచం కష్టమే కదూ!! ఈ ఫొటోలో వున్నది ప్రభాసేనా? లేదా చిరంజీవా? అనే సందేహాలు వస్తున్నాయా?? ఏం సందేహం లేదు... అతడు ప్రభాసే! 'సాహో' మేకింగ్ వీడియోలోదీ స్టిల్. 77వ సెకన్లో పాజ్ బట్టన్ నొక్కితే ప్రభాస్ ఈ లుక్కులో కనిపిస్తారు. పాజ్ బటన్ నొక్కకపోతే కనురెప్ప మూసి తెరిచేలోపు వెళ్లిపోతాడు. ఈ ఫ్రేమ్ మీద నెట్టింట్లో బోల్డంత డిస్కషన్ జరుగుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అచ్చంగా మెగాస్టార్ చిరంజీవిలా వున్నాడని అంటున్నవాళ్లు ఎంతోమంది!
- 'అరే... ప్రభాస్ అచ్చంగా చిరంజీవిలా వున్నాడేంటి?' అని ఒకరు ట్వీట్ వేస్తే...
- 'గ్యాంగ్‌లీడర్ సినిమాలో చిరంజీవిని చూసినట్టే వుంది' అని మరొకరు ఫేస్బుక్లో పోస్ట్...
- 'చూడండి.. చిరంజీవిలా మారిన ప్రభాస్‌ని చూడండి' అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంకొకరు..
'సాహో' మేకింగ్ వీడియోలో రిచ్‌నెస్, ప్రొడక్షన్ వేల్యూస్, హాలీవుడ్ స్టాండర్డ్స్‌తో పాటు చిరంజీవితో ప్రభాస్ కంపేరిజన్ కూడా టాక్ అఫ్ ది టాలీవుడ్ అయింది.