ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?
on Oct 13, 2018
యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు హీరోగా నటించిన 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రానికి బ్రహ్మాండమైన వసూళ్లు వస్తున్నాయి. అమెరికాలో తొలిరోజు ఈ సినిమా మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో నాన్ బాహుబలి రికార్డులు సృష్టించింది. ఎన్టీఆర్ నటనకు అభిమానులు నీరాజనం పడుతున్నారు. త్రివిక్రమ్ డైలాగులకు మంచి పేరొస్తుంది. అందరూ హ్యాపీ. సినిమా విడుదల రోజున సక్సెస్ మీట్ పెట్టారు. సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన గురించి త్రివిక్రమ్ సంతోషం వ్యక్తం చేశారు. అయితే... ఈ సక్సెస్ మీట్‌కి ఎన్టీఆర్ రాలేదు. హీరో ఎందుకు రాలేదు? అనేది కొందరి మధ్య డిస్కషన్ పాయింట్. ఇటీవల ఎన్టీఆర్ కుటుంబంలో జరిగిన విషాదం గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు వుండరు. అందుకని, సక్సెస్ మీట్‌కి రాలేదని సమాచారం. సినిమా విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్ ట్వీట్స్ చేసిన సంగతి గుర్తుండే వుంటుంది. గురువారం విడుదలైన 'అరవింద సమేత వీరరాఘవ' పలు ఏరియాల్లో తొలిరోజు నాన్ బాహుబలి రికార్డులు సృష్టించింది. శుక్రవారం వసూళ్లు కూడా బావున్నాయి. దసరా సెలవులు కావడంతో మరో వారం రోజులు సినిమా బాగా ఆడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.