వాళ్ళిద్దరికీ కాజల్ మరదలే!
on Oct 1, 2018
హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కి, స్టార్ మా ఛానల్లో వస్తున్న బిగ్‌బాస్ రియాలిటీ షోకి ఏమైనా సంబంధం వుందా? ఏమాత్రం లేదు. కాజల్ ఎప్పుడూ బిగ్‌బాస్ షో గురించి మాట్లాడలేదు. కన్నెత్తి చూడలేదు. కాని తెలుగు 'బిగ్‌బాస్' విజేతలకు, కాజల్‌కు ఓ సంబంధం వుంది తెలుసా? అదేంటో ఓ లుక్కేయండి! తెలుగులో 'బిగ్‌బాస్' ఫస్ట్ సీజన్ విన్నర్ ఎవరు? నటుడు శివబాలాజీ! కాజల్, శివబాలాజీ కలిసి ఓ సినిమాలో నటించారు. నవదీప్ మరో హీరోగా నటించిన ఆ సినిమా పేరు 'చందమామ'. అందులో వరసల ప్రకారం చూస్తే... కాజల్‌కి శివబాలాజీ బావ అవుతాడు.
'బిగ్‌బాస్' సెకండ్ సీజన్‌కి వద్దాం! ఇందులో విన్నర్ ఎవరు? కౌశల్! ప్రభాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన సినిమా 'మిస్టర్ పర్ఫెక్ట్'. ఇందులో కౌశల్ నటించాడు. అదీ కాజల్‌కి బావగా! క్లైమాక్స్, అంతకు ముందు సన్నివేశాల్లో వస్తాడు. అతణ్ణి కాజల్ బావ అని పిలుస్తుంది. దీంతో ఇంటర్నెట్లో కొత్త చర్చ మొదలైంది. బిగ్‌బాస్ రెండు సీజన్స్‌లో విజేతలు కాజల్‌కి సినిమాల్లో బావగా నటించారు. అందువల్ల, మూడో సీజన్లోనూ సినిమాల్లో కాజల్‌కి బావగా నటించిన నటుల్లో ఎవరో ఒకరు విన్నర్ అవుతారేమో? అని సరదాగా సెటైర్స్ వేస్తున్నారు. 'బృందావనం' సినిమాలో కాజల్‌కి బావగా అజయ్ నటించాడు. ఒకవేళ షోలోకి అతడు వెళితే... అతడిదే విజయం అంటున్నారు. మూడో సీజన్ విన్నర్ ఎవరో చూద్దాం!!