కుక్క కోసం...ముక్కలకు తమన్నా టాటా!
on Sep 28, 2018
ఈలోకంలో ముక్క లేకపోతే ముద్ద దిగని మనుషులు చాలామంది ఎంతోమంది వున్నారు. భోజనంలో కంపల్సరీ కాక్కముక్కలు వుండాల్సిందే. ఓ నెలక్రితం వరకూ తమన్నాదీ అదే బాపతు. లొట్టలు వేసుకుంటూ నాన్‌వెజ్ తిన్నారు. కాని నెల రోజుల నుంచి మాంసాహారం తినడం మానేశారామె. ఎందుకో తెలుసా? ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క పెబెల్స్కి అనారోగ్యం చేయడంతో నాన్‌వెజ్ తిండికి ఫుల్ స్టాప్ పెట్టారు. అసలు వివరాల్లోకి వెళితే... నెల రోజుల పెబెల్స్ నాన్‌వెజ్ తినడంతో అనారోగ్యానికి గురైంది. డాక్టర్స్ దగ్గరకు వెళ్లగా... పారాలిటిక్ ఎటాక్ వచ్చిందని, కుక్కకు మాంసాహారం పెట్టడం మానేయమని చెప్పారట. పెబెల్స్కు పెట్టకుండా తను తినడం తమన్నాకు ఇష్టం లేక పూర్తిగా నాన్‌వెజ్ మానేశారు. వెజిటేరియన్‌గా మారారు. అప్పటికప్పుడూ మాంసాహారం తినకూడదని తమన్నా నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తండ్రి సంతోష్ భాటియా తెలిపారు. తమన్నా నిర్ణయం పట్ల పెటా కార్యకర్తలు, జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.