'యన్టీఆర్' బయోపిక్‌లో మరో దర్శకుడు
on Sep 28, 2018
అవును... 'యన్టీఆర్' బయోపిక్‌లోకి మరో దర్శకుడు వచ్చాడు. ఆల్రెడీ రామకృష్ణ స్టూడియోలో రెండు మూడు రోజులు షూటింగ్ కూడా చేశారట. అయితే, తేజ స్థానంలో క్రిష్ వచ్చినట్టు... క్రిష్ స్థానాన్ని భర్తీ చేయడానికి ఈయన రాలేదు. జస్ట్ అతిథి పాత్రలో కాసేపు కనిపించి వెళ్ళడానికి వచ్చారు. ఆయనే 'జయం మనదేరా', 'జై బోలో తెలంగాణ' సినిమాల దర్శకుడు ఎన్. శంకర్. తెలుగు సినిమా ప్రేక్షకులు, పరిశ్రమ ప్రముఖులు 'జానపదబ్రహ్మ' అని పిలిచే దర్శకుడు విఠలాచార్య.
యన్టీఆర్ హీరోగా ఎన్నో హిట్ సినిమాలు తీశారు. యన్టీఆర్ బయోపిక్‌లో ఆయన పాత్ర కూడా వుంది. అందులో ఎన్. శంకర్ కనిపించనున్నారు. విఠలాచార్యగా శంకర్, యన్టీఆర్గా బాలకృష్ణపై ఇటీవల రామకృష్ణ స్టూడియోలో 'బందిపోటు' నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను తెరకెక్కించారని తెలిసింది.