వెంకటేష్ కూతురు ప్రేమ వివాహం
on Sep 22, 2018
'వెంకీ మామ'... విక్టరీ వెంకటేశ్ త్వరలో నటించబోయే సినిమా. ఇందులో వెంకీ మేనల్లుడు నాగచైతన్య మరో హీరో. రియల్ లైఫ్‌లో వీళ్ళిద్దరూ మామ-అల్లుడు. రీల్ లైఫ్‌లోనూ మామ-అల్లుడు పాత్రల్లో నటించనున్నారు. సినిమాలో వెంకటేశ్‌ని చైతూ 'వెంకీ మామ' అని పిలుస్తుంటాడు. రియల్ లైఫ్‌లో అదే పిలుపుతో వెంకటేశ్‌ని మరొకరు పిలిచేందుకు రెడీ అయ్యారు. అతను ఎవరు? అనుకుంటున్నారా!! అయితే అసలు వివరాల్లోకి వెళ్లాల్సిందే. విక్టరీ వెంకటేశ్ ఇంట త్వరలో పెళ్లి బాజా మోగనుంది. వెంకీకి ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు. త్వరలో పెద్ద కుమార్తె ఆశ్రిత పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... హైదరాబాద్ రేస్ కోర్స్ చైర్మన్ ఆర్. సురేందర్ రెడ్డి కుమారుడితో వెంకీ కుమార్తె పెళ్లి జరగనుంది. ఇది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహంగా తెలుస్తోంది. పిల్లల ప్రేమ సంగతి తెలిసిన తరవాత ఇరు కుటుంబ సభ్యుల మాట్లాడుకుని పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారట. త్వరలో నిశ్చితార్థం, పెళ్లి తేదీలు ఖరారు కానున్నాయి.