రానా తర్వాత నాగబాబు నటిస్తాడట...!
on Sep 10, 2018
విశ్వ విఖ్యాత నటుడు ఎన్టీఆర్ లైఫ్ హిస్టరీ ఆధారంగా బాలకృష్ణ టైటిల్ రోల్ లో క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `ఎన్టీఆర్`. ఈ బయోపిక్ గురించి ఇప్పటికే రోజుకో ఆసక్తికరమైన న్యూస్ వస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో నటించే నటీనటలు గురించి. ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషిస్తుండగా, నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటిస్తున్నాడు. పురంధరేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్ర కోసం భరత్ రెడ్డిని తీసుకున్నారు. హరికృష్ణ క్యారక్టర్ కోసం కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు. రకుల్ ప్రీతి సింగ్ , రాశిఖన్నా లను శ్రీదేవి, జయప్రద పాత్రలో కోసం తీసుకున్నారు. అయితే లేటేస్ట్ న్యూస్ ఏంటంటే లెజండరీ యాక్టర్ యస్వీ రంగారావు పాత్ర కోసం మెగా బ్రదర్ నాగబాబును తీసుకున్నట్టు సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో జరుగుతోంది. రానా పాల్గొనగా చంద్రబాబు నాయుడు పాత్రకు సంబంధించిన సీన్స్ పిక్చరైజ్ చేస్తున్నారు. త్వరలో నాగబాబు ఎన్టీఆర్ బయోపిక షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాడని తెలుస్తోంది. నెక్ట్స్ ఇయర్ సంక్రాతి కానుకగా జనవరి 9న ఈ సినిమా విడుదల కానుంది.