కపిల్ దేవ్ బయోపిక్ లో అల్లు అర్జున్..!!
on Sep 7, 2018
'నా పేరు సూర్య' తరువాత అల్లు అర్జున్ ఇంతవరకు ఏ కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.. అదిగో ఆ డైరెక్టర్ తో సినిమా ఈ డైరెక్టర్ తో సినిమా అంటూ రోజుకో వార్త వినిపిస్తుంది కానీ ఇంతవరకు అల్లు అర్జున్ తరువాతి సినిమా మీద ఎవరికీ క్లారిటీ లేదు.. అల్లు అర్జున్ తరువాతి సినిమా విక్రమ్ కుమార్ తో ఉండొచ్చనే వార్తలు ఈ మధ్య బాగా వినిపిస్తున్నాయి.. అయితే ఇప్పుడొక ఆసక్తికరమైన వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.. అదేంటంటే కపిల్ దేవ్ బయోపిక్ లో అల్లు అర్జున్ నటించబోతున్నాడట.. టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్ ‘83’ అనే టైటిల్‌తో బాలీవుడ్ లో తెరకెక్కుతోంది.. ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్ నటిస్తున్నాడు.. ఈ బయోపిక్‌లో కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రను మన స్టైలిష్ స్టార్ పోషించనున్నట్టు సమాచారం.. కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 1983లో భారత్ ప్రపంచ కప్ గెలిచిన నేపథ్యంగా తెరకెక్కుతోంది.. ఈ బయోపిక్ లో నిజంగానే అల్లు అర్జున్ నటిస్తే ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చినట్టు అవుతుంది.