వైరల్ అవుతున్న సమంత సీన్స్
on Sep 4, 2018
సమంత... ప్రస్తుతం ఈ పేరు పెళ్ళికి ముందుకన్నా పెళ్ళి తర్వాత కుర్రకారు గుండెల్లో గుబులు బాగా రేపుతుందనే చెప్పాలి. ఎందుకంటే... సమంత నాగచైతన్యను పెళ్ళి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమవుతుందని అందరూ అనుకున్నారు కానీ ‘రంగస్థలం’చిత్రంలో పల్లెటూరు పిల్లగా నటించడమే కాకుండా తన ఒంపుసోంపులతో అందర్నీ ఆకట్టుకుంది. పెళ్ళి తర్వాత కూడా ఇలాంటి గ్లామర్ పాత్రలు చేస్తుందంటే సమంతను మెచ్చుకోకుండ వుండలేము. ప్రస్తుతం సమంత ‘యు టర్న్’చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఈ నెల 13న వినాయకచవితి సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. కాగా.. ఇటు తెలుగుతో పాటు సమంత తమిళంలో కూడా నటిస్తోంది పెళ్ళి తర్వాత. సమంత తమిళంలో నటిస్తున్న తాజా చిత్రం ‘సీమారాజా’.
ఈ చిత్రంలో తమిళ యంగ్ హీరో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను ఇటీవలే రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్లో సమంతను హీరో శివకార్తికేయన్ ఎత్తుకున్న సీన్ మరియు హీరోని తన అందమైన కళ్లతో సమంత కొంటిగా చూస్తుంది. ఈ సీన్స్ ప్రస్తుతం షోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్నట్లు ఈ చిత్రం కూడా వినాయకచవితి సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. అంతే కాకుండా తమిళంలో హిట్ సాధిస్తే మాత్రం తెలుగులో కూడా రీమేక్ చేయాలనే ఆలోచనలో వున్నారట చిత్రం యూనిట్.