పవన్ బర్త్ డేకి చరణ్ అదిరిపోయే గిఫ్ట్..!!
on Aug 28, 2018
రంగస్థలంతో అదిరిపోయే హిట్ అందుకున్న రామ్ చరణ్.. ఓ వైపు నిర్మాతగా చిరంజీవితో 'సైరా నరసింహారెడ్డి' చేస్తూనే, మరోవైపు హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఇంతవరకు ఈ సినిమా టైటిల్ కానీ, ఫస్ట్ లుక్ కానీ రివీల్ చేయలేదు.. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను పవన్ కళ్యాణ్ బర్త్ డే గిఫ్ట్ గా ప్లాన్ చేస్తున్నాడట చరణ్.. సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట.. నిజానికి చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా చరణ్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయాలని అనుకున్నారు.. కానీ అదే రోజు సైరా నరసింహారెడ్డి టీజర్ విడుదల చేయడంతో అది కుదరలేదు.. దీంతో పవన్ పుట్టిన రోజున విడుదల చేయాలని చరణ్, బోయపాటి నిర్ణయించారట.. మొత్తానికి బాబాయ్ పవన్ బర్త్ డే కి, చరణ్ మంచి గిఫ్టే ప్లాన్ చేసాడుగా అంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.