చిరు 'సైరా' సెట్లో బాలయ్య..!!
on Aug 28, 2018
సినిమాల పరంగా ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది కానీ తామంతా కలిసే ఉంటామని ఎప్పటికప్పుడు చాటుతూనే ఉంటారు తెలుగు హీరోలు.. ఇప్పటి తరం హీరోలైతే ఫ్రెండ్స్ లా రెగ్యులర్ గా కలుస్తూ ఉంటున్నారు కూడా.. అయితే యంగ్ హీరోల మధ్యే కాదు, సీనియర్ హీరోల మధ్య కూడా ఫ్రెండ్షిప్ అలానే ఉంటుందని మరొక్కసారి చాటారు చిరంజీవి, బాలకృష్ణ.. ప్రస్తుతం చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' సినిమాతో, బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.. అయితే రీసెంట్ గా బాలకృష్ణ సైరా సెట్ కి వెళ్లినట్టు తెలుస్తోంది.. చిరంజీవిని కలిసి ఆల్ ది బెస్ట్ చెప్పిన బాలకృష్ణ, కాసేపు అక్కడే ఉండి సరదాగా మాట్లాడినట్టు సమాచారం.. ఈ ఫొటోస్ అయితే బయటికి రాలేదు కానీ, ఈ వార్త తెలిసి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.