బిగ్ బాస్ షో ని ఆపేయాలి..!!
on Aug 24, 2018
తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ దూసుకెళ్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో ని ఆపేయ్యాలంటూ హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్, మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు.. బిగ్బాస్ షో పేరుతో ఒకే ఇంటిలో 16 మందిని నిర్బంధించి సమాజానికి ఉపయోగపడని, అనవసరమైన వికృత చేష్టలను ప్రసారాలు చేస్తున్నారని ఆయన చెబుతున్నారు.. ఈ షోతో ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తూ, కుటుంబ వ్యవస్థను నాశనం చేసేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.. యువతను చెడు మార్గాల వైపు నడిపిస్తున్న ఈ షోను వెంటనే నిలిపివేయాలని ఆయన కోరారు.. గృహ నిర్బంధంలో ఉన్న ఆ 16 మంది సభ్యులతో పాటు ప్రజలను కాపాడాలని మానవ హక్కుల కమిషన్ను భాస్కర్ కోరారు.. మరి ఈ విషయంపై మానవ హక్కుల కమిషన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.. గతంలో కూడా కొన్ని టీవీ షోల ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయి.. మరి ఇలాంటి ఫిర్యాదులు కామన్ అని బిగ్ బాస్ యాజమాన్యం లైట్ తీసుకుంటుందో లేక దీనిపై ఏమైనా దృష్టి పెడుతుందో చూడాలి.