సైరా నరసింహారెడ్డి టీజర్ రివ్యూ
on Aug 21, 2018
మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమా వినాయక్ దర్శకత్వంలో, రామ్ చరణ్ నిర్మాతగా 'ఖైదీ నెంబర్ 150' తో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చారు.. సినిమాలకు కాస్త గ్యాప్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర మెగాస్టార్ స్టామినా ఏ మాత్రం తగ్గలేదని ఈ సినిమా రుజువు చేసింది.. మెగాస్టార్ ఫైట్స్, డాన్సులు, డైలాగ్ లతో అభిమానులను మెప్పించారు.. దాని తరువాత మెగాస్టార్ సైరా నరసింహారెడ్డి సినిమా అనౌన్స్ చేసారు.. దీనికి కూడా రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించటం విశేషం.. ఇక ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు..
మెగాస్టార్ జన్మదినం సందర్భంగా ఈ సినిమా టీజర్ ను కుటుంబ సభ్యులు, చిత్ర యూనిట్ సమక్షంలో ప్రసాద్ లాబ్స్ లో విడుదల చేసారు.. ఈ టీజర్ బాగా ఆకట్టుకుంటుంది.. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి పాత్రలో చిరంజీవి ఒదిగిపోయారు.. అమిత్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బావుంది.. అలాగే బ్రిటీష్ కాలం నాటి వాతావరణాన్ని చూపించటంలో సురేందర్ రెడ్డి సక్సెస్ అయ్యారు.. మొత్తానికి మెగా అభిమానులకు మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఈ టీజర్ అదిరిపోయే గిఫ్ట్ అనే చెప్పాలి.. టీజర్ తో ఆకట్టుకున్న చిరంజీవి ట్రైలర్, సినిమాతో ఇంకెంతలా ఆకట్టుకుంటారో చూడాలి.