సైరా సెట్ కూల్చివేత.. అయినా షూటింగ్ కి సైరా.!!
on Aug 7, 2018
ప్రభుత్వ స్థలంలో అనుమతి తీసుకోకుండా సెట్ వేసి షూట్ చేసుకుంటున్నారంటూ రెవెన్యూ అధికారులు సైరా సెట్ ను కూల్చివేసిన సంగతి తెలిసిందే.. అయితే ఈ విషయంపై స్పందించని చిత్ర యూనిట్, షూటింగ్ త్వరగా పూర్తి చేసి, అనుకున్న సమయానికి చిత్రాన్ని విడుదల చేయాలని చూస్తుందట.. రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న రామ్ చరణ్, అధికారులు సెట్ కూల్చివేసినా.. వెనకడుగు వేయకుండా, విరామం తీసుకోకుండా షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారట.. ఇప్పటికే వేరే స్థలంలో సెట్ వేయించి త్వరలోనే షూటింగ్ చేయాలని అనుకుంటున్నారట.. మొత్తానికి సైరా విడుదల ఆలస్యమవుతుందని ఆందోళన చెందిన అభిమానులకి, రామ్ చరణ్ డెసిషన్ ధైర్యం ఇస్తుందనే చెప్పాలి.