వీరిలో దేవదాసు ఎవరు...?
on Jul 5, 2018
ఏఎన్నార్, సావిత్రి నటించిన దేవదాసు సినిమా ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంది.. ప్రేమకథ అంటే దేవదాసు, ప్రేమికులు అంటే దేవదాసు-పార్వతి ముందుగా గుర్తొస్తారు తెలుగు ప్రేక్షకులకు.. అలాంటి దేవదాసు టైటిల్ తో నాగార్జున త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారట.. ప్రస్తుతం నాగార్జున, నానితో కలిసి ఓ మల్టీస్టారర్ చేస్తున్నారు.. దీనికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు.. అయితే ఈ సినిమాకి 'దేవదాసు' టైటిల్ పెట్టాలని చిత్రబృందం భావిస్తోందట.. ఈ సినిమాలో నాగార్జున గ్యాంగ్ స్టర్ గా, నాని డాక్టర్ గా కనిపించనున్నారు.. ఆద్యంతం కామెడీగా సాగే ఈ సినిమాకి దేవదాసు టైటిల్ పరిశీలనలో ఉండటంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. చూద్దాం నాగార్జున, నాని నిజంగానే దేవదాసు టైటిల్ తో వస్తారో లేక వేరే ఏదైనా టైటిల్ తో వచ్చి అలరిస్తారో.