అరవిందసమేత టీజర్ ఎప్పుడు..?
on Jul 5, 2018
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అరవిందసమేత' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే విదులైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.. దీంతో ఈ సినిమా టీజర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. అయితే తాజాగా ఈ చిత్ర యూనిట్, టీజర్ విడుదల డేట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.. ఇండిపెండెన్స్ డే సందర్బంగా ఆగస్టు 15 న టీజర్ విడుదల చేయాలని భావిస్తున్నారట.. అలానే సినిమాని దసరాకి విడుదల చేయాలని చూస్తున్నారు.. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా కావడంతో.. అరవిందసమేత మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.. చూద్దాం అరవిందసమేత ఎంతలా ఆకట్టుకుంటుందో.