ప్రభాస్, రానా మరో యుద్ధానికి సిద్ధం..!
on Jul 3, 2018
ప్రభాస్, రానా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'బాహుబలి' సృష్టించిన ప్రభంజనం అంతాయింతా కాదు.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. తెలుగు సినిమా బాహుబలికి ముందు, బాహుబలికి తరువాత అని చెప్పుకొనే స్థాయి విజయాన్ని సాధించింది.. బాహుబలిగా ప్రభాస్, భళ్లాలదేవగా రానా పోటీపడి నటించారు.. అయితే వీరిద్దరూ కలిసి మరోసారి వెండితెర మీద పోటీపడి నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.. సంతోషం, మిస్టర్ పర్ ఫెక్ట్ లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న దశరథ్.. కాస్త విరామం తీసుకొని మరీ, ప్రభాస్ కోసం అదిరిపోయే కథను సిద్ధం చేశారట.. అయితే ఈ కథలో మరో కీలక పాత్ర కూడా ఉందట.. ఆ పాత్రకు రానా అయితే బాగుంటుందని దశరథ్ భావిస్తున్నారట.. మరి దశరథ్ అనుకున్నట్టు ప్రభాస్, రానా కాంబినేషన్లో మరో సినిమా వస్తే ప్రేక్షకులకు పండగే.