‘డిస్కో రాజా’గా రవితేజ
on Jun 29, 2018
చాలా రోజుల గ్యాప్ తర్వాత ‘రాజా ది గ్రేట్’గా ఎంట్రీ ఇచ్చిన మాస్ మహారాజా రవితేజ నేలటికెట్టుతో భారీ షాక్ ఇచ్చాడు. అటు అభిమానులూ, ఇటు విమర్శకులూ నేలటికెట్టు చూసి బావురుమన్నారు. ఇంత బాధలో ఉన్న అభిమానులకు ఓ శుభవార్త. టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం లాంటి విభిన్నమైన సినిమాలు తీస్తున్న ఆనందతో రవితేజ ఒక సినిమా ఒప్పుకున్నాడట. దీనికి డిస్కో రాజా అని పేరు పెట్టినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. అంతేకాదు! ఇందులో రవితేజ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారట. ఈ ఏడాది అక్టోబరు నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవ్వ వచ్చని తెలుస్తోంది. కాకపోతే ఒకటే డౌట్. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలు తీసే ఆనంద్కీ, పక్కా మాస్ సినిమాలు చేసే రవితేజకీ ఎలా పొంతన కుదురుతుందో చూడాలి!