పెళ్లిచూపులు దర్శకుడితో రానా?
on Jun 27, 2018
పెళ్లిచూపులు.. చిన్న సినిమాగా వచ్చి చాలా పెద్ద విజయం సాధించింది.. ఎంతగా అంటే ఈ సినిమా చూసి సురేష్ బాబు, మూడు సినిమాలు తన ప్రొడక్షన్ లో చేయమని దర్శకుడు తరుణ్ భాస్కర్ ని అడిగే అంతగా.. సురేష్ బాబు ఆఫర్ కి హ్యాపీగా ఓకే చెప్పేసిన తరుణ్, 'ఈ నగరానికి ఏమైంది' అనే సినిమా చేసారు.. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. అయితే తరుణ్ అప్పుడే తరువాతి సినిమా స్క్రిప్ట్ పనిలో పడిపోయాడట.. ఈ స్క్రిప్ట్ కి రానా అయితే న్యాయం చేస్తాడని తరుణ్ భావిస్తున్నాడట.. అంటే పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ తో రానా సినిమా చేసే అవకాశం ఉందన్నమాట.. ఎలాగూ తరుణ్, సురేష్ బాబు ప్రొడక్షన్లో ఇంకో రెండు సినిమాలు చేయాలి.. వాటిల్లో ఒక సినిమా రానాది అవ్వడంతో ఆశ్చర్యం లేదు.. చూద్దాం మరి తరుణ్, రానాతో ఎలాంటి కథతో వస్తాడో.