పవన్ ట్విట్టర్లో రేణూదేశాయ్ రెండో పెళ్ళి...!
on Jun 26, 2018
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ రెండో పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే నిశ్చితార్థం అయినట్టు సోషల్ మీడియా ద్వారా తెలియచేసిన రేణూ, త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది.. అయితే ఈ విషయంపై అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు.. కొందరు రేణూ పెళ్ళికి మద్దతు తెలుపుతుండగా, మరికొందరు రెండో పెళ్లి చేసుకోవద్దంటూ కోరుతున్నారు.. ఇలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ, పవన్ కళ్యాణ్ కూడా ట్విట్టర్ వేదికగా రేణూ రెండో పెళ్లిపై స్పందించారు.. 'కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న రేణూ గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు.. అంతా మంచే జరగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.. ప్రకృతి తనకు ఆయురారోగ్యాలు, ప్రశాంతత ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అని పవన్ ట్వీట్ చేసారు.