సభకు నమస్కారం అంటున్న నాని
on Jun 21, 2018
నేచురల్ స్టార్ నాని, ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునతో కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ, అలానే ‘మళ్లీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘జెర్సీ’ అనే మూవీ చేస్తున్నాడు.. మరోవైపు బిగ్ బాస్-2 హోస్ట్ గా బుల్లితెర మీద సందడి చేస్తున్నాడు.. అయితే ఇప్పుడు నాని మరో మూవీ ఓకే చేసాడట.. దిల్ రాజు నిర్మాణంలో, ఒక కొత్త దర్శకుడు ఈ మూవీ ద్వారా పరిచయం అవబోతున్నట్టు తెలుస్తుంది.. అలానే ఈ మూవీకి 'సభకు నమస్కారం' అనే టైటిల్ పరిశీలనలో ఉందట..ఇప్పటికే నాని, దిల్ రాజు కలయికలో వచ్చిన 'నేను లోకల్’ ‘ఎంసిఎ’ సినిమాలు కమర్షియల్ విజయాలు సాధించాయి.. మరి 'సభకు నమస్కారం'తో హ్యాట్రిక్ విజయం సాదిస్తారేమో చూడాలి.