నాకు అదొక్క సమస్యే ఉంది: రానా
on Jun 19, 2018
సెలబ్రిటీ గురించి ఒక వార్త బయటికొస్తే చాలు.. అది నిజమో కాదో తెలుసుకోకుండా ఆ వార్తని మోసుకొని వెళ్తూనే ఉంటారు.. ప్రస్తుతం రానా విషయంలో కూడా అదే జరిగింది.. బాహుబలి, ఘాజి, నేనే రాజు నేనే మంత్రి లాంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రానా సినిమాలు ఈమధ్య కాలంలో రిలీజ్ కాలేదు..
'రానా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు, సింగపూర్ నుండి డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు.. దానివల్ల రానా షూటింగ్లో పాల్గొనట్లేదు.. అందుకే సినిమాలు ఆలస్యమవుతున్నాయి' అంటూ ఒక వార్త బయటికొచ్చింది.. ఇది నిజమనుకొని ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందారు.. అయితే ఈ వార్తలని రానా ఖండించాడు.. నాకు ఒకే ఒక సమస్య ఉంది కంటి సమస్య.. ఈ వార్తలు అవాస్తవం, నేను ఆరోగ్యంగా, ఫిట్ గా ఉన్నానని రానా స్పష్టం చేసారు.. అదన్నమాట ఇక రూమర్స్ ఆపేయండి, ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందకండి.