ఎన్టీఆర్, శ్రీనివాస్ రెడ్డి మధ్య విభేదాలు లేన్నట్టేనా?
on Jun 9, 2018
ఎన్టీఆర్ స్టార్ హీరో అయినప్పటికీ.. క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్స్ తో కూడా మంచిగా ఉంటూ ఫ్రెండ్షిప్ చేస్తాడని టాక్ ఉంది.. ఒకప్పుడు ఎన్టీఆర్ ఫ్రెండ్స్ లిస్ట్ లో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి పేరు కూడా వినిపించేది.. అయితే గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళ మధ్య మాటల్లేవని, విభేదాలు కారణంగా ఎన్టీఆర్, శ్రీనివాస్ రెడ్డిని దూరం పెట్టాడని వార్తలొచ్చాయి.. దానికి తగ్గట్టే కొన్ని సంవత్సరాలుగా శ్రీనివాస్ రెడ్డి, ఎన్టీఆర్ సినిమాల్లో కనిపించలేదు.. దీంతో ఆ వార్తలకి బలం చేకూరింది.. అయితే ఇప్పుడు ఆ వార్తలన్నిటికి శ్రీనివాస్ రెడ్డి ఒక్క ఫొటోతో చెక్ పెట్టాడు.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ తో కలిసి 'అరవింద సమేత' సెట్లో దిగిన ఫోటోని శ్రీనివాస్ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసాడు.. ఈ ఫోటో చూసిన ఫ్యాన్స్ ఎన్టీఆర్, శ్రీనివాస్ రెడ్డి మధ్య విభేదాల్లేవ్ అంటూ హ్యాపీగా ఫీలవుతున్నారు.