నితిన్‌ని భయపెడుతున్న 'ఫ్లాప్' హీరోయిన్
on Apr 3, 2018
రంగస్థలం హడావుడి కొనసాగుతుండగానే `ఛల్ మోహన రంగ` వచ్చేస్తోంది. ఈ గురువారం విడుదలకు సిద్ధమైన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. పవన్ కల్యాణ్ నిర్మాత కావడం, ఈ చిత్రానికి త్రివిక్రమ్ కథ అందించడం... ఇవి రెండూ అంచనాల్ని పెంచేశాయి. ట్రైలర్ కూడా కూల్‌గానే ఉంది. హిట్టయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి గానీ.. దానికి తోడు కొన్ని భయాలూ ఉన్నాయి. రంగస్థలం చూసిన కళ్లతో ఇప్పుడు ఏ సినిమా చూసినా పెద్దగా ఆనదేమో అనిపిస్తోంది. రంగస్థలంతో పాటు వసూళ్లు పంచుకోవాల్సిన పరిస్థితి ఛల్ మోహన్ రంగది. దానికి తోడు `లై` అనే అట్టర్ ఫ్లాప్ తరవాత వస్తున్న సినిమా ఇది. అందులో తనతో పాటు నటించిన.. మేఘా ఆకాష్ ఇందులోనూ కనిపిస్తోంది. తొలి సినిమాతోనే ఫ్లాప్ హీరోయిన్ అనిపించుకుంది మేఘా. ఆ యాంటీ సెంటిమెంట్... 'ఛల్ మోహన్ రంగ'ని ఎలా నడిపిస్తుందో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా ఈ సినిమాకి కథ అందించింది త్రివిక్రమే అయినా... ఆయన కూడా ఫ్లాపులోనే ఉన్నాడు. 'అజ్ఞాతవాసి' ఎఫెక్ట్ పరోక్షంగానైనా ఈసినిమాపై పడబోతోంది. అలా.. ఇన్ని మైనస్సుల మధ్య 'ఛల్ మోహనరంగ' విడుదల అవుతోంది. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.