మెగాస్టార్ లీకుల వెనుక అంత పెద్ద రహస్యం ఉంది
on Apr 2, 2018
సౌత్ సినిమాలకి బాలీవుడ్ సినిమాలకి చాలా విషయాల్లో తేడాలు గమనిస్తూ ఉంటాం. కథలు ఎన్నుకోవడం దగ్గరి నుండి, సినిమాని ప్రమోట్ చేసే విషయం వరకు ఎవరి వ్యూహాలు వాళ్ళకి ఉంటాయి. స్టార్ హీరోల సినిమాల విషయానికి వచ్చే సరికి, దక్షిణాదిలో అన్ని విషయాలు గోప్యం గా ఉంచుతారు. ఫస్ట్ లుక్ దగ్గరి నుండి, సినిమా స్టోరీ వరకు ఏ విషయాలు బయటకి పొక్కకుండా జాగ్రత్త వహిస్తారు. అయితే, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ సైరా నరసింహా రెడ్డి లో ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కొన్ని ఫోటోలు ఆన్లైన్ లో లీక్ చేసాడు. తన ఫస్ట్ లుక్ తో పాటు, చిరంజీవి, నయనతార ల ఫోటలని కూడా తన బ్లాగ్ లో పెట్టేసాడు బిగ్ బి. ఈ విషయంలో చిరంజీవి కానీ, డైరెక్టర్ సురేందర్ రెడ్డి కానీ, నిర్మాత రామ్ చరణ్ కానీ, ఒక్క మాట కూడా అనలేదు. అక్కడ లీక్ చేసింది బిగ్ బి కాబట్టి మౌనం వహించారు అని అభిప్రాయాలు వెలువడ్డాయి. కానీ, ఈ మెగా లీకుల వెనుక అసలు రహస్యం వేరే ఉందట. సైరా ని హిందీ లో కూడా విడుదల చేసే ఉద్దేశ్యంలో ఉన్న దర్శక, నిర్మాతలు బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు మరియు నేషనల్ మీడియా కంట పడేందుకు బిగ్ బి ద్వారా లీకుల పన్నాగం పన్నారట. అమితాబ్ లాంటి సూపర్ స్టార్ ఉన్నాడు అంటే, బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు ఉత్సాహం చూపిస్తారు అనేది వారి ఆలోచనగా కనిపిస్తుంది. మరి, ఈ వ్యూహం ఎంత వరకు ఫలితాల్ని ఇస్తుందో వేచి చూడాలి.