ENGLISH | TELUGU  

బాబాయ్ పవన్ కోసం చరణ్ ఆ త్యాగం చేస్తాడా?

on Apr 2, 2018

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో అన్న చిరంజీవి కుటుంబంతో అత్యంత సన్నిహితంగా మెదులుతున్నాడు. రామ్ చరణ్ పుట్టిన రోజుకి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన పవన్, అందరితో కలిసి లంచ్ కూడా చేసాడు. ఈ మధ్య విడుదలయిన రంగస్థలం సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కి అభినందనలు తెలిపాడు. చరణ్ కూడా బాబాయ్ విషెస్ కి ధన్యవాదాలు తెలిపాడు. పవన్ కళ్యాణ్ తన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ టీం కి రామ్ చరణ్ కోసం ఒక మంచి కథ సిద్ధం చేయాలని చెప్పినట్లు తెలిసింది. అంతా సక్రమంగా జరిగితే, పవన్ కళ్యాణ్ నిర్మాణంలో రామ్ చరణ్ ఒక సినిమా చేయనున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాని దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. ఇక అసలు విషయానికి వస్తే, రంగస్థలం హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తుంది. త్వరలో థియేటర్లు కూడా పెరిగే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఈ ప్రభంజనం ఇంకో రెండు వారాలు కొనసాగే అవకాశం ఉంది. అయితే, వచ్చే వారం విడుదల కానున్న నితిన్ చల్ మోహన్ రంగ కి ఇది అతి పెద్ద సమస్య గా మారనుంది. పవన్ కళ్యాణ్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టాలంటే ఎక్కువ థియేటర్లలో విడుదల చేయాలి. కానీ, రంగస్థలం ని తీసేసి చల్ మోహన్ రంగ కి థియేటర్లు ఇచ్చే అవకాశం తక్కువ. ఒకవేళ చరణ్ కానీ, రంగస్థలం నిర్మాతలు కానీ, కొన్ని థియేటర్లు త్యాగం చెయ్యకపోతే నితిన్ సినిమాకి ఇక్కట్లు తప్పవు. మరి, బాబాయ్ కళ్ళల్లో ఆనందం కోసం అబ్బాయి చరణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి!


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.