బిగ్ బి ని తన కారులో తిప్పుతున్న చిరంజీవి
on Mar 31, 2018
మెగాస్టార్ చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ సైరా నరసింహ రెడ్డి లో ఒక క్యామియో రోల్ చేస్తున్న బిగ్ బి అమితాబ్ బచ్చన్ కి హైదరాబాద్ లో సాదర స్వాగతం లభించింది. ప్రత్యేకమైన చార్టెడ్ ఫ్లైట్ లో హైదరాబాద్ చేరుకున్న బిగ్ బి కి తెలంగాణ ప్రభుత్వం టైట్ సెక్యూరిటీ ఇచ్చింది. సైరా టీం కూడా ప్రత్యేకమయిన సెక్యూరిటీ అరేంజ్ చేసిందట. ఇక చిరంజీవి అయితే, తన రోల్స్ రాయిస్ కార్ ని బిగ్ బి హోటల్ నుండి సెట్స్ కి, షూటింగ్ స్పాట్ నుండి మళ్లీ హోటల్ కి వెళ్లేందుకు కేటాయించాడట. బిగ్ బి క్యారవాన్ లోకి యూనిట్ మెంబెర్స్ ని ఎవర్ని కూడా అలో చేయలేదట. ఇంటి దగ్గరి నుండి ప్రత్యేకంగా కెర్రిఆర్ తెప్పించేవాడట మెగాస్టార్. ఇన్ని సకల మర్యాదలకి అమితాబ్ బచ్చన్ తబ్బిబ్బయ్యాడట. రెండు రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్న బిగ్ బి ట్విట్టర్ లో ఫోటోలు కూడా పోస్ట్ చేసాడు. చిరంజీవి ని సైరా గెటప్ లో చూసిన మెగాభిమానులు బిగ్ బి కి అభినందనలు తెలుపుతున్నారు. చిరంజీవికి గురువుగా కనిపించనున్న అమితాబ్ పుణ్యామా అని సైరా ని బాలీవుడ్ లో పెద్ద లెవెల్ లో విడుదల చేసేలా వ్యూహాలు రచిస్తున్నారట.