ఎన్టీఆర్ బాట పట్టిన బాలకృష్ణ, అసలైన సర్ప్రయిజ్ అదే...
on Mar 29, 2018
దాన వీర శూర కర్ణ... ఈ సినిమా తీయడానికి ఎన్టీఆర్ కి పట్టింది మహా అయితే ఒక నెల రోజులు. ఇలాంటి చాలెంజింగ్ మూవీస్ ఎన్నింటినో తక్కువ కాలంలో పూర్తి చేసిన ఘనత ఎన్టీఆర్ సొంతం. ఈ విషయంలో తండ్రి బాట పడుతున్నాడు బాలకృష్ణ. ఎన్టీఆర్ బయోపిక్ ఈ రోజు రామకృష్ణ స్టూడియోస్ లో గ్రాండ్ గా లాంచ్ అయినా విషయం మనకు తెలిసిందే. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తో పాటు మరికొందరు సినిమా, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి అతిధులుగా విచ్చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దర్శకుడు తేజ ఎన్టీఆర్ బయోపిక్ ని దసరా కాళ్ళ విడుదల చేస్తానని ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసాడు. రేపు కేవలం ఒక్క రోజు మాత్రమే షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ లో మొదలవుతుంది. అంటే, బాలకృష్ణ మరియు ఎన్టీఆర్ చిత్ర యూనిట్ కేవలం నాలుగు నెలల్లో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. గ్రాఫిక్స్ కి ఎక్కువ సమయం తీసుకుంటుంది కాబట్టి, షూటింగ్ వీలయినంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నట్టున్నారు. అందుకు గాను, రాత్రి, పగలు అని లేకుండా శ్రమించడానికి సిద్ధమయ్యారని వినికిడి. సో, ఎన్టీఆర్ లాగ బాలకృష్ణ కూడా తక్కువ టైం లో సినిమాలు పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నట్టున్నారు
Also Read