బాలయ్య.. శ్రీరెడ్డికి చోటిస్తాడా?
on Mar 28, 2018
ఎన్టీఆర్ బయోపిక్‌లో నందమూరి బాలకృష్ణ తరవాత ఖరారైన పేరు ఎవరిదో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవును.. బాలయ్య తరవాత నటీనటుల విభాగంలో ఖరారైన ఒకే ఒక్క పేరు.. శ్రీరెడ్డి.
శ్రీరెడ్డి ఎవరో గత రెండు మూడు వారాలుగా తెలుగు ఛానళ్లు, వెబ్ సైట్లు ఫాలోఅవుతున్న వాళ్లకు ప్రత్యేకంగా చెప్పక్కర్లెద్దు. ఇండ్రస్ట్రీని దుమ్మెత్తి పోస్తూ.. ఇక్కడ అవకాశాలు రావాలంటే ఆడవాళ్ల శరీరాలు మగవాళ్ల కింద నలగాల్సిందే అంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చిన తెలుగమ్మాయి. అవకాశాల పేరుతో నన్నువాడుకుని వదిలేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాంటి అమ్మాయిని వెదికి పట్టుకుని, పిలిచి మరీ రెండు సినిమాల్లో అవకాశాలు ఇచ్చాడు తేజ. అందులో ఎన్టీఆర్ బయోపిక్ ఒకటి. బాలయ్య పక్కన హీరోయిన్ ఎవరు? బాలీవుడ్ నుంచి తీసుకొస్తారా? విద్యాబాలన్ ఖరారైందా? అని ఆలోచిస్తున్న బాలయ్య అభిమానులకు శ్రీరెడ్డి ఎంట్రీ షాక్ ఇచ్చేదే. మొత్తానికి శ్రీరెడ్డి అనుకున్నది సాధించింది. వివాదాస్పద వ్యాఖ్యలతో కెమెరా ముందు రెచ్చిపోతే జనం దృష్టిలో పడతామని, అవకాశాలు వెదుక్కంటూ వస్తాయని శ్రీరెడ్డి నమ్మింది. ఇప్పుడు అదే నిజమైంది. `నాలానే మీరూ శ్రీరెడ్డికి అవకాశాలు ఇవ్వండి` అని తేజ చెప్పడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంటే... శ్రీరెడ్డి మోసపోయిందని, అమ్మాయిల్ని అవకాశాల పేరుతో వాడుకునే వాళ్లు పరిశ్రమలో ఉన్నారని తేజ నమ్ముతున్నాడా? అయితే శ్రీరెడ్డికి ఇప్పుడు పిలిచి అవకాశాలు ఇచ్చినవాళ్లంతా ఆ బాపతే అనుకోవాలా? శ్రీరెడ్డికి ఎన్టీఆర్ బయోపిక్‌లో ఛాన్సు ఇచ్చాడు సరే.. బాలయ్య దానికి `ఓకే` అంటాడా? ఎందుకంటే ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు బాలయ్య. నటీనటుల ఎంపికలో తనదే తుది నిర్ణయం అట. మరి... బాలయ్య శ్రీరెడ్డి రాకని ఆహ్వానిస్తాడా? ఇలా ఎన్ని అనుమానాలో..! వీటికి సమాధానాలు ఎప్పుడు దొరుకుతాయో చూడాలి.