రంగస్థలం పై సందేహాలు వద్దు
on Mar 22, 2018
రామ్ చరణ్ రంగస్థలం పాటలు సూపర్ హిట్టయ్యాయి. ఎంత సక్కగున్నావే సాంగ్ అయితే, ఈ మధ్య కాలంలో బెస్ట్ గా చెప్పుకుంటున్నారు. అప్పట్లో విడుదల చేసిన రెండు టీజర్లకు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో, సినిమా పై అంచనాలు పెరిగాయి. రిలీజ్ కి దగ్గరవుతున్న తరుణంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే, ట్రైలర్ ఊహించినంతగా లేకపోవడం, మరియు చిరంజీవి ఈవెంట్ లో మాట్లాడిన పద్ధతి అభిమానుల్ని కలవరానికి గురి చేసింది. అసలే, తమిళ్ ఫ్లేవర్ అంటూ కొందరు పెదవి విరిస్తే, ట్రైలర్ మామూలుగా ఉండడం సినిమా పై డౌట్స్ పెంచింది. కానీ, కొన్ని సోర్సెస్ ప్రకారం రంగస్థలం దర్శక నిర్మాతలు కావాలనే తమ సినిమాని లో ప్రొఫైల్ లో ఉంచుతున్నారట. తద్వారా, థియేటర్స్ కి వచ్చే ఆడియన్స్ కి కొత్త అనుభూతి ఇవ్వొచ్చనేది వారి అభిప్రాయం గా కనిపిస్తుంది. రంగస్థలం తో చరణ్ ఓవర్సీస్ మార్కెట్ పెంచుకోవడం ఖాయం అని కూడా అంటున్నారు. అనసూయ క్యారెక్టర్ కి మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది అంటున్నారు. త్వరలో సెన్సార్ కి వెళ్లనున్న రంగస్థలం ఈ నెల 30 కి ప్రపంచ వ్యాప్తంగా విడుదలవనుంది.