English | Telugu

చిత్రం కాకపోతే... ఏంటీ ‘చిన్న’ మాయ?

on Feb 19, 2018

తెలుగు చిత్ర పరిశ్రమలో వారసుల హవా నడుస్తోంది. పాత హీరోలందరూ తమ కొడుకుల్ని హీరోలను చేయడం తెలుగు చిత్ర సీమలో బాలకృష్ణతో మొదలైందనాలి. నటవారసునిగా ఫస్ట్ సక్సెస్ చూసింది బాలయ్యే. అయితే... ఇక్కడ అనుకోని చిత్రం ఒకటి జరిగింది. అదేంటంటే.. దాదాపు హీరోలందరి వారసుల్లో చిన్నకొడుకు మాత్రమే సక్సెస్ అవ్వడం యాదృశ్చికం. 

తొలుత బాలయ్య సంగతే చూద్దాం. నిజానికి ఎన్టీయార్ హీరోను చేయాలనుకుంది బాలయ్యను కాదు. హరికృష్ణను. కానీ... హరికృష్ణకు అమ్మవారు పోసి...  ముఖంపై స్పోటకం మచ్చలు ఏర్పడటం... అనుకున్నంత ఎత్తు లేకపోవడం.. ఇత్యాది కారణాల వల్ల.. అందగాడు, మంచి నటుడయ్యే లక్షణాలున్న బాలయ్యను హీరోను చేశారు ఎన్టీయార్. అనుకున్నట్టే బాలయ్య హీరోగా గ్రాండ్ సక్సెస్ అవ్వడమే కాదు.. దేశంలోని సినీ వారుసుల్లో అత్యథిక సంవత్సరాలు హీరోగా చలామణీ అయిన... అవుతున్న హీరోగా రికార్డ్ సృష్టించాడు. నటుడిగా బాలయ్య వయసు 44 ఏళ్లయితే... హీరోగా 34 ఏళ్లు. ఇండియాలో ఏ నటవారసుడికీ ఇంత లాగ్విటీ లేదు. 

తర్వాతి నట వారసుడు నాగార్జున. ఈయన కూడా చిన్న కొడుకే కావడం విశేషం. మొదటి కుమారుడు వెంకట్ అక్కినేనిని నిర్మాతగా ప్రోత్సహిచి.. నాగ్ ని మాత్రం హీరోని చేశారు ఏఎన్నార్. తండ్రి నమ్మకాన్ని నిజం చేస్తూ...గ్రాండ్ సక్సెస్ అయి.. నేటికీ హీరోగానే చలామణీ అవుతున్నారు నాగ్. టాలీవుడ్ ‘మన్మథుడు’ అంటే నేటికీ నాగార్జునే. 

ఇక మూడో వారసుడు... డా.డి.రామానాయుడు చిన్న కుమారుడు వెంకటేశ్. తొలి కుమారుడు సురేశ్ బాబుకి తన బాద్యత అప్పగించి.. చిన్న కొడుకు వెంకీని మాత్రం హీరోని చేశారు నాయుడుగారు. ఓ నిర్మాత కొడుకు ఇంత పెద్ద స్టార్ అవ్వడం... ఇన్నేళ్ల పాటు హీరోగానే రాణించడం వెంకీ విషయంలోనే జరిగింది. 

నాల్గవ నట వారసుడు మహేశ్ బాబు. సూపర్ స్టార్ కృష్ణకు మహేశ్ కూడా చిన్న కొడుకే. తొలి కుమారుడు రమేశ్ ని హీరోగా పరిచయం చేసినా.. ఆయన రాణించలేకపోయాడు. సామ్రాట్, బజార్ రౌడీ... ఈ రెండు విజయాలతోనే సరిపెట్టుకున్నాడు. వాటి తర్వాత రమేశ్ చేసిన అన్నీ ఫ్లాపులే. దాంతో.. కాస్త లేట్ గా అయినా... 1999లో మహేశ్ ని హీరోగా పరిచయం చేయించారు కృష్ణ. తండ్రి బాధను చెరిపేస్తూ... ‘సూపర్ స్టార్’  అనిపించుకున్నాడు మహేశ్. 

ఇక బన్నీ.. ఈయన గారు కూడా అల్లు అరవింద్ కి చిన్న కొడుకే కావడం గమనార్హం. చిన్నప్పట్నుంచీ నటనపై మక్కువ పెంచుకున్న బన్నీని నటునిగా ప్రోత్సహించాడు అరవింద్. తండ్రి నమ్మకాన్ని నిజం చేస్తూ స్టైలిష్ స్టార్ అనిపించుకున్నాడు బన్నీ. 

ప్రభాస్ విషయంలోనూ దాదాపు ఇలాగే జరిగింది. కృష్ణంరాజుకి మగ సంతానం లేకపోవడంతో... తమ్ముడి కొడుకైన ప్రభాస్ ని హీరోని చేశారు. ఆయన ప్రస్తుతం నేషనల్ స్టార్. 

ఈ విధంగా మన బాలయ్య అన్నట్టు.. అనుకోకుండా.. యాదృచ్చికంగా.. కాకతాళీయంగా... హీరోల చిన్న కొడుకులే స్టార్ హీరోలై... తెలుగు సినిమాను ఓ రేంజ్ లో ఏలేస్తున్నారు. అదన్నమాట విషయం.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here