English | Telugu

కెమిస్ట్రీ కుదరని జంటలు!

on Feb 15, 2018

తెరపై కెమిస్ట్రీ వర్కవుట్ కాని జంటలు చాలా ఉన్నాయ్. కేవలం ఈ కాంబినేషన్ వల్లే.. సినిమాలు దెబ్బ తిన్నాయని కాదు... సినిమా ఫ్లాప్ అవ్వడానికి ఈ కాంబినేషన్లు కూడా ఓ కారణం అయ్యాయని చెప్పడమే ఈ కథనం సారాంశం.  ఇక విషయంలోకెళ్దాం. 

చిరంజీవి పక్కన ఏ హీరోయిన్ అయినా ఇట్టే సరిపోతుంది. ఇప్పటివరకూ ఆయన కెరీర్ లో కెమిస్ట్రీ కుదరని హీరోయిన్ అంటే.. ఒక్కరే కనిపిస్తారు. ఆమె పేరు ‘కరిష్మా కొటాక్’. ‘శంకర్ దాదా జిందాబాద్’ లో ఏరీకోరి ముంబాయ్ నుంచి దిగుమతి చేశారు ఈ అందాలభామను.  కానీ ఏం లాభం! చిరంజీవితో కెమిస్ట్రీ కుదరని కథానాయికగా చరిత్రలో నిలిచిపోయింది. 

బాలకృష్ణ పక్కన సక్సెస్ అయిన హీరోయిన్... సూపర్ స్టార్ అవుతుందని ఓ సెంటిమెంట్ ఉంది. విజయశాంతి, రోజా, సిమ్రాన్. నయనతార అందుకు ఉదాహరణలు. అలాంటి బాలయ్య పక్కన కూడా కెమిస్ట్రీ వర్కవుట్ కాని హీరోయిన్ ఉందండీ. ఆమే ‘అనుష్క’. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘ఒక్కమగాడు’ డిజాస్టర్. 

నాగార్జున పక్కన నటించాలని హీరోయిన్లు తహతహలాడేవారు. ‘మన్మథుడు’ కదా. అలాంటి నాగ్ పక్కన కూడా కెమిస్ట్రీ వర్కవుట్ అవ్వని హీరోయిన్ అంటే... ఆమే పేరు ’రోజా’నే. ఇద్దరూ కలిసి ‘వజ్రం’ అనే సినిమా చేశారు. అట్టర్ ఫ్లాప్. ఆ దెబ్బకు మళ్లీ కలిసి చేయలేదు. 

వెంకటేశ్ సినిమాల ద్వారా హీరోయిన్లుగా పరిచయమైనవాళ్లు స్టార్లవుతారనేది ప్రతీది. దివ్యభారతి, అంజలా జవేరీ, ప్రతీజింతా, కత్రినాకైఫ్, ఆర్తి అగర్వాల్... వీళ్లంతా వెంకీ హీరోయిన్లే. అయితే.. వెంకీ పక్కన అస్సలు కెమిస్ట్రీ కుదరని హీరోయిన్ గా చరిత్రకెక్కింది మాత్రం తాప్సీనే. ‘షాడో’ సినిమాలో ఆయనకు జోడీ నటించింది తాప్సీ. 
‘బంగారం’ హీరోయిన్ మీరా చోప్రా. ‘కొమరం పులి’ హీరోయిన్  నికిషా పటేల్.. పవన్ పక్కన కెమిస్ట్రీ కుదరని హీరోయిన్లయితే... 

‘యువరాజు’ జంట మహేశ్, సిమ్రాన్.. ‘దమ్ము’ జంట తారక్, త్రిష... ‘వరుడు’ జంట  అల్లు అర్జున్, భానుశ్రీ మెహ్రా...  కెమిస్ట్రీ అస్సలు వర్కవుట్ కాని జంటలుగా నిలిచిపోయారు. 

ఇంకా ఇలా కెమిస్ట్రీ వర్కవుట్ కాని జంటలు చాలామందే ఉన్నారు మన టాలీవుడ్ లో. అదనమాట విషయం. 

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here