ముందు జాగర్తగా మూడు వారాలు గడపనున్న రానా
on Feb 6, 2018
వరుస హిట్లతో దూసుకుపోతున్న రానా దగ్గుబాటి కన్ను ఇతర మార్కెట్ల పై పడింది. బాహుబలి తో దేశం మొత్తం గుర్తింపు పొందిన రానా తదుపరి చిత్రం హాతి మేరే సాతి మూడు భాషల్లో నిర్మాణం జరుపుకోనుంది. ప్రభు సోలొమన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో రానా ఏనుగులని సవారి చేసే మావటి రోల్ లో కనువిందు చేయనున్నాడు. ఈ సినిమా కోసం రానా దాదాపు 15 కిలోల బరువు తగ్గాడు.
బాహుబలి కోసం ఒళ్ళు హూనం చేసుకున్న రానా, హాతి మేరే సాతి కోసం కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాడు. వచ్చే నెలలో థాయిలాండ్ లో షూటింగ్ మొదలెట్టే ముందుగా దాదాపు మూడు వారాల పాటు ఏనుగులతో గడపనున్నాడట. అలా ఎందుకు అంటారా? ఏనుగులతో మచ్చిక కోసం. ట్రైనర్ల పర్యవేక్షణలో రానా ఈ మూడు వారాలు ఏనుగులతో సహవాసం చేయనున్నాడు. సో, షూటింగ్ టైం లో వాటితో ఈజీ గా మసలుకోవచ్చు. అయితే, ఈ సినిమా కంప్లీట్ గా రాజేష్ ఖన్నా క్లాసిక్ హాతి మేరే సాతి కి రీమేక్ కాదట. కొన్ని అంశాలు మాత్రమే తీసుకుంటున్నారట. థాయిలాండ్ లో కాకుండా, కేరళ, ఢిల్లీ లలో షూటింగ్ జరుపుకోనుంది. ఇంకా ఇతర నటులు, సాంకేతిక నిపుణులు ఫైనల్ అవ్వలేదు. షూటింగ్ త్వరగా పూర్తి చేసి, దీపావళి కి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.