ENGLISH | TELUGU  

దమ్ముంటే... టచ్ చేసి చూడు మూవీ రివ్యూ

on Feb 2, 2018

సినిమా:  టచ్ చేసి చూడు
తారాగణం; రవితేజ, రాశీఖన్నా...
దర్శకత్వం: విక్రమ్ సిరికొండ
నిర్మాత; నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశీ

‘టచ్ చేసి చూడు’ సినిమా ప్రమోషన్లో  రవితేజా మాట్లాడుతూ... కొత్తగా ఆలోచిస్తుంటే జనాలకు మింగుడు పడటం లేదన్నాడు.  మరి కొత్తగా ఆలోచించి చేసిన ‘రాజా ది గ్రేట్‘ సినిమాను జనాలు ఎందుకు హిట్ చేశారు? సినిమా అంతా అంధుడిగా కనిపిస్తే... ఎందుకు ఆ సినిమాకు బ్రహ్మరథం పట్టారు? సినిమా మొత్తాన్ని భుజంపై మోస్తూ ఎన్నో విజయాలిచ్చాడు రవితేజా. అయితే... కొన్నాళ్లకు అదే మోనాటనీ అయ్యింది. ఫ్లాపులొచ్చాయ్.  ‘రాజా ది గ్రేట్’ తో... రవితేజ నుంచి జనాలు ఏం కోరుకుంటున్నారో రూఢీ అయ్యింది. అయితే.. తను మాత్రం మళ్లీ రొటీన్ గానే ఆలోచిస్తున్నాడు. దానికి రవితేజా స్టేట్మెంట్ ఉదాహరణ. రీసెంట్ గా విడుదలైన ‘టచ్ చేసి చూడు’ సినిమా  కూడా రవితేజా అభిప్రాయానికి అనుగుణంగానే ఉంది. ఈ సినిమా గురింంచి మాట్లాడుకునే ముందు... అసలు కథేంటో చూద్దాం.

కథ

వ్యాపారవేత్త కార్తికేయకు కుటుంబం అంటే ప్రాణం... సిటీలో ఉన్న ఓ గూండా కారణంగా తన మనుషులు గాయాలపాలవుతారు. అంతేకాదు... తాను అభిమానించే వ్యక్తి హత్యకు గురవుతాడు. ఆ హత్య తన చెల్లి కళ్లారా చూసినా... పోలీసుల నుంచి మాత్రం సహకారం లభించదు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటాడు కార్తికేయ. అయితే... సరిగ్గా అప్పుడూ తాను ఊహించని సంఘటన ఒకటి జరుగుతుంది. తాను చనిపోయాడనుకున్న ఓ వ్యక్తి కార్తికేయకు మళ్లీ కనిపిస్తాడు. ఆ హత్య చేసింది కూడా వాడే. దాంతో కార్తికేయ ఉగ్రుడవుతాడు. అసలు ఈ కార్తికేయ ఎవరు? తాను చనిపోయాడని అనుకుంటున్న ఆ దుండగుడు ఎవడు? ఈ ప్రశ్నలకు సమాధానం మిగిలిన కథ.

విశ్లేషణ:

దీన్ని కథ అంటే... కథలన్నీ సిగ్గు పడతాయ్.  కథ లేకుండా షూటింగ్ మొదలెట్టేసి... రన్నింగ్ లో ఏదో ఒకటి చేసుకుంటూ.. . చివరకు ఒక రూపు రాగానే... జనాల మీదకు వదిలినట్టు ఉంటుందీ ఈ సినిమా. పరమ రొటీన్ సీన్స్. తెరపై ఏంటేంటో జరుగుతుంటాయ్. అంతా గందరగోళం. ముందు వ్యాపారవేత్తగా కనిపించిన రవితేజా... ఉన్నట్టుండి పోలీసైపోతాడు. మసలా సినిమాలు తీయడానికి కూడా ఓ పద్ధతుంది. అసలు ఇందులో  ఏ పద్ధాతీ కనిపించదు. ఈ సినిమాలో ఇది బావుంది అని చెప్పడానికి ఏమీ లేదు.

రవితేజ నటన గురించి తెలిసిందే. కానీ...ఆ ముఖంలో వచ్చిన మార్పు వల్ల.. ఇబ్బందిగా కనిపిస్తున్నాడు. రాశీఖన్నా అందంగా ఉంది. ఉన్నంతలో బాగా చేసింది. ఆ రెండో హీరోయిన్ ని దేనికోసం పెట్టుకున్నారో దర్శక, నిర్మాతలకే తెలియాలి.
పాటలు, మాటలు, కెమెరా, ఎడిటింగ్... ఇలా ప్రతి విభాగం... సినిమా చెడగొట్టడానికి తమ ప్రయత్నం తాము చేశాయ్. మరి ఈ సినిమా జనాలకు నచ్చుతుందో లేదో కాలమే చెప్పాలి.

రేటింగ్: 1.5


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.