English | Telugu

ఎన్టీయార్, చరణ్ లతో పాటు మరో స్టార్ కూడానట?

on Jan 30, 2018


ఇద్దరు హీరోలు నటించే ప్రతి సినిమా మల్టీస్టారర్ అవ్వదు. ఆ హీరోలిద్దరూ స్టార్లు అయ్యుండాలి. అప్పుడే అది మల్టీస్టారర్. మధ్య కాలంలో వచ్చిన రియల్ మల్టీస్టారర్లు అంటే... సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, గోపాల గోపాల సినిమాలనే చెప్పుకోవాలి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మరో రియల్ మల్టీస్టారర్  అంటే... అది కచ్చితంగా... రాజమౌళి సినిమానే. ఎందుకంటే ఆ సినిమాలో హీరోలు ఎన్టీయార్, రామ్ చరణ్. ఇద్దరూ స్టార్లే. భారీ అభిమాన గణం ఉన్న కథానాయకలే. సో... ఇది అసలు సిసలు మల్టీస్టారర్ అన్నమాట.

అయితే.. ఈ సినిమాలో వీరితో పాటు మరో స్టార్ హీరోను కూడా నటింపజేయాలనే తలంపుతో ఉన్నాడట రాజమౌళి. అయితే.. ఆ స్టార్ చేసేది హీరో పాత్ర కాదు. విలన్ పాత్ర.  రాజమౌళి సినిమాల్లో విలన్ ఎంత శక్తిమంతంగా కనిపిస్తాడో తెలిసిందే. ఇద్దరు సూపర్ స్టార్లు నటించే ఈ సినిమాలో... విలన్ కూడా అదే స్థాయి వ్యక్తి అయితే... సినిమా రంజుగా ఉంటుందని రాజమౌళి అభిప్రాయం. అందుకే... విలన్ గా ఓ స్టార్ ని వెతికే పనిలో పడ్డాడట రాజమౌళి. విజయేంద్రప్రసాద్ ఇప్పటికే ఓ అద్భుతమైన కథ తయారు చేశాడు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ కథలో విలన్ ది అత్యంత శక్తిమంతమైన పాత్ర. అందుకే... ఆ పాత్రను హీరోతో చేయించాలనుకుంటున్నాడట. మరి ఆ పాత్ర  ఏ స్టార్ హీరోని వరిస్తుందో చూాడాలి.

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here