English | Telugu

రంగస్థలం టైటిల్‌లో ఈ అద్భుతాన్ని గమనించారా..?

on Jan 25, 2018

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "రంగస్థలం" ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. నిన్న మొన్నటి వరకు సంక్రాంతి సినిమాలు.. మధ్యలో భాగమతి, నా పేరు సూర్య సినిమాల గురించి చర్చించుకున్న వారి దృష్టిని ఒకే ఒక్క టీజర్‌తో తన వైపుకు తిప్పుకున్నాడు చిట్టిబాబు. బుధవారం రిలీజైన రంగస్థలం టీజర్‌లో డైలాగ్ డెలీవరీలోనూ.. నటనలోనూ తన గత చిత్రాల కంటే ఎంతో మెచ్యూరిటీ చూపించాడు చెర్రీ. సుకుమార్ తన మార్క్ టేకింగ్‌తో టాలీవుడ్ మోస్ట్ ఎవేయిటేడ్ మూవీగా దీనిని మార్చేశాడు.

ఈ సంగతి పక్కనబెడితే. ప్రజంట్ ఈ మూవీకి సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీకి "రంగస్థలం" టైటిల్‌ను ఫిక్స్ చేయడం వెనుక మెగా ఫ్యాన్స్ ఒక స్టోరీ చెబుతున్నారు. రంగస్థలం టైటిల్‌ని ఇంగ్లీష్‌లో రాస్తే "RANGASTHALAM" టైటిల్‌లోని మొదటి రెండు పదాలు, చివరి రెండు పదాలు కలిపితే రామ్‌ అని వస్తుంది. అది చరణ్ పూర్తి పేరులోని మొదటి పదం. ఇక ఈ టైటిల్‌లో హీరోయిన్ సమంత పేరు కూడా ఉంది. టైటిల్‌లోని కొన్ని లెటర్స్‌ను కలిపితే సమంత పేరు వస్తుంది. ఇలా రంగస్థలం టైటిల్‌‌ గురించి చర్చించుకుంటున్నారు. దీని వెనుక నిజంగా ఇంత అర్థం దాగి వుందా లేక మెగాభిమానులు కల్పించిన పుకారా అన్నది తెలియాల్సి ఉంది.

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here