English | Telugu

ఒక ప్రొడ్యూసర్.. ఒక డైరెక్టర్ వల్లే ఇక్కడి దాకా వచ్చా

on Jan 18, 2018

గ్లామర్ ప్లస్ యాక్టింగ్ రెండూ ఉన్న హీరోయిన్లు ప్రస్తుతం దొరకడం కష్టమే.. అందం కావాలంటే యాక్టింగ్ ఉండదు.. యాక్టింగ్ కావాలంటే అందం ఉండదు.. సో.. దర్శకనిర్మాతలు ఏదో ఒకటి త్యాగం చేయకతప్పదు. అయితే ఈ రెండు మిక్సయిన హీరోయిన్లు దొరడం చాలా అరుదు అని చెప్పవచ్చు. అలాంటి వారిలో ఒకరు అనుష్క శెట్టి. సూపర్‌ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కన్నడ కస్తూరి మొదట్లో స్కిన్ షోకే పరిమితమైంది. అయితే అరుంధతిలో జేజేమ్మగా తన నటవిశ్వరూపాన్ని చూపించింది. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తూ నెంబర్‌వన్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. ఎంతమంది కొత్తమ్మాయిలు వచ్చినా అనుష్క ప్లేస్ అనుష్కదే.

రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తాను ఇంతటి స్టార్‌డమ్ సంపాదించడం వెనుక ఇద్దరు వ్యక్తులు ఇచ్చిన సపోర్టే కారణమన్నారు. నా మొదటి సినిమా టైమ్‌లో నాకసలు ఏం తెలియదు.. కనీసం స్క్రిప్ట్ ఎలా వినాలో.. విన్న తర్వాత ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా తెలియదు.. అలాంటి పరిస్థితుల్లో పూరీ జగన్నాథ్ గారే అన్ని నేర్పించారు. ఇక అరుంధతి సినిమాకు శ్యామ్‌ప్రసాద్ రెడ్డి గారు నన్ను ఎంచుకోబట్టే నా జీవితం మారిపోయింది. కాబట్టి వీరిద్దరూ లేకపోతే నేను అసలు ఇక్కడి దాకా వచ్చేదానిని కాదు అంటూ వారిపై ఉన్న అభిమానాన్ని చాటుకుంది స్వీటీ.

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here