English | Telugu

బాలయ్యపై మహీంద్రా అధినేత కామెడీ ట్వీట్!

on Jan 17, 2018


’పలనాటి బ్రహ్మనాయుడు’ సినిమా గుర్తుందా? అందులో మన బాలయ్య...తొడగొట్టి  సైగ చేయగానే... రైలు వెనక్కి వెళ్లిపోతుంది. తొడక్కడి పిలవగానే.. రయ్యమని కుర్చీ దగ్గరకొచ్చేస్తుంది. ఇలాంటి విచిత్ర  చేష్టలు కేవలం బాలయ్య చేస్తేనే చూస్తారని రీసెంట్ గా ‘జైసింహా’ ప్రెస్ మీట్ లో బ్రహ్మానందం అన్నాడు. అయితే... వీటిపై ఓ చానల్ కిచ్చిన ఇంటర్ వ్యూలో బాలయ్య స్పందిస్తూ.. ‘ఇలాంటి చేయడం వల్ల జనాలు నవ్వుకున్నారు తప్ప.. విజయాలు మాత్రం దక్కలేద‘ని నిజాలు మాట్లాడారు. అయితే.. రీసెంట్ చిత్రం ‘జై సింహా’ లో కూడా మళ్లీ ఇలంటి చిత్రాలే చేశాడు బాలయ్య. గతంలో జరిగిన అనుభవాలను ఏ మాత్రం పట్టించుకోకుండా.. మళ్లీ ఈ కామెడీని సీరియస్ గా రిపీట్ చేశాడు. పోలీస్ అధికారికి వార్నింగ్ ఇచ్చే సన్నివేశంలో సీరియస్ గా ‘బొలెరో కారు’ను ఎడమ చేత్తో లేపేసి... తెరపై పెద్ద కామెడీనే క్రియేట్ చేశాడు.

ఈ కామెడీ ఫీట్ పై స్వయంగా మహీంద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహింద్రా స్పందించడం ఇక్కడ విశేషం.  ‘ హాహా.. బొలెరో కార్లను చెక్ చేయాడానికి మా సర్వీసింగ్ సెంటర్లలో ఇకపై హైడ్రాలిక్ లిఫ్ట్‌లు వాడనవసరం లేదు’’ అంటూ ఆయన ట్వీట్టర్ లో బాలయ్యపై కామెడీ చేశారు.  ప్రస్తుతం ఎక్కడ చూసినా.. ఈ ట్వీట్ గురించే చర్చ. జరిగిన చేదు అనుభవాలు మళ్లీ రిపీట్ కాకుండా చూసుకోవాలి కానీ.. మళ్లీ మళ్లీ ఇలా సీరియస్ కామెడీలు చేసి... నవ్వుల పాలవ్వడం ఏంటి? అని అభిమానులు వాపోతున్నారు. బాలయ్య... ఇకనైనా మారవయ్యా?


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here