పవన్ కంటే కత్తి మహేశే అందగాడు..!!
on Jan 11, 2018
సినిమాకు బ్యాడ్ టాక్ వచ్చి ఆవేదనలో మునిగి ఉన్న ’అజ్ఙాతవాసి’ టీమ్ ని.. వర్మ, కత్తి మహేశ్, హైపర్ ఆది ట్వీట్లు ఇంకాస్త ఆవేదనకు లోను చేస్తున్నాయ్. ‘పుండుకు పుల్ల మొగుడు’ అన్నట్టు.. పాపం ఈ ట్వీట్లేంటో! ఇంతకీ వీరి ట్వీట్ల గోలేంటో చెప్పనే లేదు కదూ.
’ఇప్పుడే ఓ పులిని చూసొస్తున్నా. ఇలాంటి పులిని మునుపెన్నడూ చూడలేదు. కోరలు, పంజా లేని పులి. ఎప్పటికప్పుడు చారలు మారిపోయే పులి. మరీ షాకింగ్ ఏంటంటే... ఈ పులి జంపింగ్ లు పక్కనపెట్టి పాకుతోంది’ అని ట్వీట్ చేశాడు వర్మ. అంతటితో ఆగాడా అంటే అదీ లేదు.. కత్తి మహేశ్ ని పొగడ్తలతో ముంచెత్తుతూ... ‘ఇప్పుడే మహేశ్ కత్తి రివ్యూ వీడియో కూడా చూశాను. దేవుడి మీదొట్టు... పవన్ కల్యాణ్ కంటే... కత్తి మహేశే అందగాడు’ అని మరో ట్వీట్ చేశాడు.
వర్మ ట్వీట్ కి కత్తి మహేశ్ స్పందించడం ఇక్కట మరో ట్వీస్ట్. ‘పవన్ కంటే నన్ను అందగాడ్ని చేసునందుకు వర్మ గారికి థ్యాంక్స్’ అని కత్తి మహేశ్ ట్వీటాడు. వీరిద్దరి ట్వీట్లు ఇలా ఉంటే మధ్యలో ఇంకో వ్యక్తి ఎంటరయ్యాడు. అతనే... ‘ఫైపర్ ఆది’. పవన్ అభిమానిగా.. వీరిద్దరినీ టార్గెట్ చేస్తూ ‘అదిగో తెల్లకాకి.. అంటే.. ఇదిగో పిల్లకాకి అన్నట్టుంది వీరిద్దరి ట్వీట్లు చూస్తుంటే’ అని సెటైరికల్ గా ట్వీట్ చేశాడు హైపర్ ఆది.
పవన్ ని దేవుడిలా కొలిచే అభిమానులు సైతం.. ‘అజ్ఙాతవాసి’ థియేటర్లలో ఉండటానిికి ఇష్టపడటంలేదు. పైగా బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇంత బాధాకరంగా ఉంటే.. హైపర్ ఆది మాత్రం అందుకు భిన్నంగా స్పందించడం విశేషం. ’అజ్ఙాతవాసి’ సినిమాను పవర్ స్టార్ కోసం పది సార్లు... త్రివిక్రమ్ కోసం మూడు సార్లు మొత్తం 13 సార్లు చూడాలి’ అంటూ ట్వీట్ చేశాడు.
ఓ వైపు సినిమాకు బ్యాడ్ టాక్ వచ్చి... వాళ్లు బాధపడుతుంటే..మధ్యలో వీరి ట్వీట్లేంటి చెప్మా?