పవర్‌స్టార్ కొడకా కోటేశ్వరరావు విన్నారా..!!
on Dec 31, 2017
త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అత్తారింటికి దారేది, కాటమరాయుడులో తన గాత్రంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న పవర్‌స్టార్ ఈ సినిమా కోసం "కొడకా" అంటూ మరోసారి గొంతు సవరించారు. అనిరుథ్ మ్యూజిక్ ఇచ్చిన అజ్ఞాతవాసి ఆడియోలోని పాటలన్ని మార్కెట్లోకి వచ్చినా.. పవన్ పాడిన "కొడకా కోటేశ్వరరావు" సాంగ్‌ని మాత్రం విడుదల చేయకుండా ఆపారు. ఈ పాటను కొత్త సంవత్సరం కానుకగా డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ కొద్దిరోజుల క్రితం టీజర్ రిలీజ్ చేసింది.
అందుకు తగ్గట్టుగానే సాంగ్‌తో పాటు మేకింగ్ వీడియోని విడుదల చేసింది హారికా హాసిని క్రియేషన్స్. పాటని పవన్ ఏ స్థాయిలో పాడాడా అనే దానికంటే.. పాట పాడేటప్పుడు పవన్ హావభావాలు, మధ్యలో వచ్చే మేకింగ్ వీడియో.. ఆ పాటలో పదాలు ఆకట్టుకున్నాయి. కొడకా.. కోటేశ్వరరావు ఖరుచైపోతావురోయ్.. పులసైపోతవురాయ్.. అంటూ పవన్ ఆడేసుకున్నాడు. ఈ సాంగ్ అలా వచ్చిందో లేదో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న అజ్ఞాతవాసి ప్రేక్షకుల ముందుకు రానుంది.