అజ్ఞాతంలో "అజ్ఞాతవాసి" ప్రమోషన్స్
on Dec 27, 2017
ఈ రోజుల్లో సినిమాను హిట్ చేయాలంటే దర్శకులకు ఒక ప్రాథమిక సూత్రం తెలిసుండాలి. అదే మార్కెటింగ్.. సినిమాలో కంటెంట్ ఎంత బాగున్నా సరే.. పబ్లిసిటీ ఫెయిల్ అయితే మూవీకి వసూళ్లు డల్ అవుతాయి. ఇది ఎన్నో సినిమాల విషయంలో రుజువైంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసికి ఈ ప్రమోషన్ ఫెయిల్యూర్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సినిమా విడుదలకు పట్టుమని పది రోజులు లేదు.. కానీ ఇప్పటి వరకు ఆడియో, టీజర్ తప్పించి అజ్ఞాతవాసిపై జనాల్లో క్యూరియాసిటీ పెంచే పని ఒక్కటి చేయలేదు. ఈ మూవీకి ఒకే ఒక్క అసెట్ పవన్ క్రేజ్. అందువల్లే అజ్ఞాతవాసిపై అంతటి అంచనాలు.
సాధారణంగా ఆడియో లాంచ్ రోజే థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసి.. హీరో, హీరోయిన్లు ఇతర టెక్నీషియన్స్‌తో ఇంటర్వ్యూలు లాంటివి పెట్టిస్తుంటారు దర్శకనిర్మాతలు. కానీ అజ్ఞాతవాసి ట్రైలర్ ఇంత వరకు రిలీజ్ చేయలేదు.. ఇక ఇంటర్వ్యూల సంగతి సరేసరి. ట్రైలర్‌ను అప్పుడే రిలీజ్ చేస్తే సినిమా మీద హైప్ తగ్గిపోతుందని.. అందుకే దానిని జనవరి ఫస్ట్ వీక్‌లో విడుదల చేయాలన్నది త్రివిక్రమ్ ప్లాన్ అని ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ స్ట్రాటజీతో అజ్ఞాతవాసికి ప్రమోషన్ కొరత స్పష్టంగా కనిపిస్తోంది అంటున్నారు క్రిటిక్స్. తెలుగు రాష్ట్రాలపై ఇది అంతగా ఎఫెక్ట్ చూపించకపోవచ్చు గానీ.. ఓవర్సీస్కి మాత్రం దెబ్బే అంటున్నారు సినీజనాలు. మరి త్రివిక్రమ్ తన మనసు మార్చుకొని ట్రైలర్‌ను కొంచెం ముందుకు జరుపుతాడో.. లేక అన్నమాటకే కట్టుబడతాడో వేచి చూడాలి.