ఎంసీఏ మూవీ రివ్యూ
on Dec 21, 2017
డబుల్ హ్యాట్రిక్స్‌తో ఫుల్ స్వింగ్‌లో ఉన్న నాని మరో హిట్‌ని తన ఎకౌంట్లో వేసుకున్నాడా లేదా..? హిట్‌తో ఈ ఇయర్‌ని స్టార్ట్ చేసిన దిల్‌రాజు.. హిట్‌తో ఇయర్ ఎండింగ్ చేశాడా..? సాయిపల్లవి నాని కన్నా బాగా చేసిందా..? నాని ముందు తేలిపోయిందా..? ఇలాంటి డౌట్స్ మీకు ఎందుకు వస్తున్నాయో తెలుసా..? ఈ రోజు నాని నటించిన ఎంసీఏ రిలీజైంది..? మరీ ఈ క్వశ్చన్స్ అన్నింటికి ఆన్సర్ తెలియాలంటే ఎంసీఏ రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథ:
చిన్నప్పుడే అమ్మానాన్న చనిపోవడంతో నానిని పెంచి పెద్ద చేస్తాడు అతని అన్నయ్య రాజీవ్ కనకాల.. అన్నయ్యకి భూమికతోపెళ్లవ్వడంతో.. రోజురోజుకి నానిని నిర్లక్ష్యం చేస్తాడు.. అందుకు కారణం వదినే అని అనుకొని.. తన పిన్ని వాళ్లింట్లో ఉంటాడు నాని. ఆర్టీవో ఆఫీసర్ అయిన వదినకి వరంగల్‌కు ట్రాన్స్ఫర్ అవుతుంది. అన్నయ్య ట్రైనింగ్ కోసం ఢిల్లీ వెళ్లడంతో.. వదినకి తోడుగా వరంగల్ వెళతాడు నాని. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లు బస్టాప్‌లోనే హీరోయిన్ సాయిపల్లవిని చూసి ప్రేమలో పడతాడు నాని. కథ సాఫీగా సాగుతుంది అనుకుంటున్న టైంలో అక్రమంగా నడుస్తున్న ఒక ట్రావెల్స్ బస్సులను హీరో వదిన సీజ్ చేస్తుంది.
దాంతో కక్ష కట్టిన విలన్.. అతని మనుషులు ఆమెను చంపాలని ప్రయత్నిస్తుంటారు.. ఈ లోగా వదిన మంచితనం తెలుసుకోవడం.. విలన్ ప్లాన్ అర్థమవ్వడం అని జరిగిపోతాయి. అయితే పదిరోజుల్లో నీ వదినను చంపేస్తానని విలన్ ఛాలెంజ్ చేస్తాడు.. ఈ పదిరోజులు నీ నుంచి నా వదినను కాపాడుకుంటానని విలన్ దగ్గర ఛాలెంజ్ చేస్తాడు నాని. మరి ఈ పోటీలో ఎవరు గెలిచారు.. హీరో తన వదినను ఎలా కాపాడుకున్నాడు.. నాని, సాయిపల్లవి పెళ్లవుతుందా.. తెలుసుకోవాలంటే సినిమాను చూడాల్సిందే.
విశ్లేషణ:
* నాని బాగానే చేశాడు కానీ రోటీన్ అయిపోయింది..
* ఫిదాలో భానుమతిగా తన నటనతో మెస్మరైజ్ చేసిన సాయిపల్లవికి ఈ సినిమాలో అంత మంచి రోల్ పడలేదు.
* రీఎంట్రీలో భూమిక అట్టర్ ఫ్లాపైంది.. నాని, భూమికల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్‌లో భూమిక తేలిపోయింది.
* అన్నయ్యగా రాజీవ్ కనకాలను కూడా అంతగా వాడుకోలేదు
* కమెడియన్స్ కనిపించినా పెద్దగా ఫన్ లేదు
* పాటలు ఫట్టు.. అసలు దేవి మ్యూజిక్‌లో మ్యాజిక్ లేదు
* దిల్‌రాజు చాలా పొదుపుగా డబ్బు ఖర్చు పెట్టినట్లు కనిపించింది.
* వదిన, మరిది బ్యాక్‌డ్రాప్ తెలుగుతెరకు కొత్త కాదు.. కానీ అది ఫ్యామిలీ సెంటిమెంట్‌లో ఒక భాగం మాత్రమే. అయితే ఈ సినిమాలో మొత్తం వదినను విలన్ బారీ నుండి కాపాడుకునే మరిది అనే లైన్ చుట్టూ తిరగడం కాస్త కొత్తగా ఉంది.
పంచ్ లైన్ : నానిని చూడాలనుకుంటే సినిమాకి వెళ్లొచ్చు.
రేటింగ్: 1.5