నాని సత్తానా.. నాగ్ స్ట్రాటజీనా
on Dec 20, 2017
డబుల్ హ్యాట్రిక్ విజయాలతో మంచి జోరు మీదున్నాడు నాని. నేను లోకల్, నిన్ను కోరితో సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకున్న నేచురల్ స్టార్ విజయంతో ఈ ఏడాదిని ముగించాలనుకుంటున్నాడు. వేణు శ్రీరాం దర్శకత్వంలో నాని నటించిన ఎంసీఏ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఏడాది కొట్టిన రెండు హిట్లు చాలా ఈజీగా వచ్చినప్పటికీ.. హ్యాట్రిక్ హిట్ అంత సులభం కాదంటున్నారు ట్రేడ్ పండితులు. ఎంసీఏ రిలీజైన 24 గంటల వ్యవధిలోనే అఖిల్ నటించిన హలో విడుదలవుతుంది. ఈ రెండు సినిమాలు.. రెండు సపరేట్ జోనర్స్. తన సినిమాలో అటు మాస్.. ఇటు క్లాస్ ప్రేక్షకులు మెచ్చే ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటాడు నాని.
ఇప్పుడు ఎంసీఏలోనూ అదే ఫార్ములాని ఫాలో అవుతున్నట్లు టైలర్‌ను బట్టి చెప్పవచ్చు. దానికి తోడు పక్కాగా ప్లానింగ్‌తో ఉండే స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మాత కావడం, నాని, సాయిపల్లవిల నుచురల్ పర్ఫామెన్స్.. సహజంగానే ప్రేక్షకుల చూపు ఎంసీఏ వైపుకు తిప్పుతాయి. అటు వైపు ఉన్న హలో కూడా సామాన్యమైనది కాదు.. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తుండటం.. కింగ్, అక్కినేని నాగార్జున నిర్మాత కావడంతో దీనిపైనా అంచనాలు భారీగానే ఉన్నాయి. కాస్త వెరైటీ కథ, కథనం, యాక్షన్ కావాలనుకుంటే హలో చూడాలనే డిస్కషన్ సోషల్ మీడియాలో నడుస్తోంది. దానికి తోడు ట్రైలర్, టీజర్‌ను బట్టి విక్రమ్ కొత్తగా ఏదో చెప్పబోతున్నాడనే క్యూరియాసిటీ కనిపిస్తోంది. అలాగే ఈసారి అఖిల్ చేత ఎలాగైనా హిట్ట్ కొట్టించాలని నాగ్ పక్కా వ్యూహాం ప్రకారం వెళుతున్నాడు. సో.. ఈ రెండు సినిమాల రిజల్ట్ తెలియాలంటే శుక్రవారం మధ్యాహ్నం వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు ఫిలింనగర్ జనాలు.